అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధించిన ఒక విజయం గురించి తెలుసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత గూఢచారి అధికారిగా ఎంపిక చేసుకున్న వ్యక్తి షాక్ తిన్నారట. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ స్థానానికి ట్రంప్ ఎంచుకున్న మాజీ సెనెటర్ డాన్ కోట్
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధించిన ఒక విజయం గురించి తెలుసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత గూఢచారి అధికారిగా ఎంపిక చేసుకున్న వ్యక్తి షాక్ తిన్నారట. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ స్థానానికి ట్రంప్ ఎంచుకున్న మాజీ సెనెటర్ డాన్ కోట్స్ స్వయంగా ఈ విషయం చెప్పారు. భారతదేశం ఒకేసారి 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిందని తెలిసి, అమెరికా ఈ విషయంలో ఇంకా చాలా వెనకబడి ఉందని అర్థమై ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
అవి పరిమాణంలో చిన్నవి కావచ్చు, రకరకాల పనులు చేయొచ్చు గానీ, ఒక్క రాకెట్‌లో అన్నింటిని పంపడం అంటే చిన్న విషయం కాదని, తొలుత తాను బహుశా 104 వేదికల మీద నుంచి అన్నింటినీ ప్రయోగించి ఉంటారనుకున్నానని కోట్స్ అన్నారు.
సీఐఏ సహా అమెరికాలోని అన్ని గూఢచార వ్యవస్థలకు అధిపతిగా త్వరలోనే ఆయన నియమితులు కానున్నారు. అయితే ఇస్రో సాధించిన ఈ విజయం గురించి అంతా అయిపోయేవరకు ఆయనకు తెలియదు.