Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా కాదు.. దక్షిణ కొరియాను టార్గెట్ చేసిన ఉత్తర కొరియా? ఎందుకో తెలుసా?

సిరియాపై అమెరికా సైన్యం దాడి.. ఉత్తరకొరియాను రెచ్చగొట్టినట్లైంది. అమెరికాపై దాడులకు సై అంటూ ఉత్తర కొరియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రతిఘటన ఎదురైతే ఉత్తర కొరియా ఏం చేస్తుందనే దా

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (13:41 IST)
సిరియాపై అమెరికా సైన్యం దాడి.. ఉత్తరకొరియాను రెచ్చగొట్టినట్లైంది. అమెరికాపై దాడులకు సై అంటూ ఉత్తర కొరియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రతిఘటన ఎదురైతే ఉత్తర కొరియా ఏం చేస్తుందనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. అమెరికా మీద ఉత్తరకొరియా దాడి చేస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలా జరిగే అవకాశం లేదని.. దక్షిణ కొరియాపై దాడి చేసే ఛాన్సుందని నిపుణులు చెప్తున్నారు. 
 
ఎందుకంటే.. దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి కనుక చేస్తే అది అమెరికాపై దాడి చేసినట్లే అవుతుందని.. తద్వారా దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుకు సమీపంలోనే ఉండటం ద్వారా ఉత్తర కొరియాకు లాభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, దేశ జనాభాలో 45 శాతం మంది సియోల్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో, సియోల్ ను నాశనం చేస్తే దేశం మొత్తాన్ని నాశనం చేసినట్టేనని నిపుణులు అంటున్నారు.
 
ఈ నేపథ్యంలో దక్షిణకొరియాపై ఉత్తర కొరియా దాడికి పాల్పడినట్లైతే దాని ప్రభావం ఎన్నో దేశాలపై ఉంటుంది. ఇంకా అమెరికా నుంచి ఉత్తరకొరియాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఎలాగంటే.. ప్రపంచ పటం నుంచి ఉత్తరకొరియా కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. 
 
దక్షిణ కొరియాపై దాడి చేస్తే.. ప్రపంచ అగ్రగామి సంస్థలైన శ్యామ్ సంగ్, ఎల్ జీ, హ్యుండాయ్ తదితర కంపెనీలన్నీ నాశనమవుతాయి. ఇవన్నీ అమెరికా అండతోనే దక్షిణ కొరియా అభివృద్ధి జరిగిందని.. అందుకే ఉత్తర కొరియా దక్షిణ కొరియాను టార్గెట్ చేసే అవకాశాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments