కోతి నుంచి మానవుడు జన్మించాడని అంటుంటారు. మనిషి చేష్టలు కూడా కొన్ని సందర్భాల్లో అచ్చం కోతిలాగానే ఉంటాయి. దీన్ని నిరూపించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినా జంతు ప్రదర్శనశాలలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది.
ఇక్కడ ఉన్న ఓ జూలో అనేక గొరిల్లాలు ఉన్నాయి. ఇవి అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించాయి. వీటి ప్రవర్తన చూసిన సందర్శకులంతా ముక్కున వేలేసుకుని ఔరా వీటి తాపత్రయం అంటూ కామెంట్స్ చేశారు.
వర్షం పడుతుండగా.. తమ బిడ్డలు తడవకుండా ఉండాలనే ఉద్దేశంతో అవి పడిన తాపత్రయం ఔరా అనేలా చేసింది. పిల్లల్ని పొత్తిళ్లలో పట్టుకుని.. చుక్క నీరు వాటిమీద పడకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్లాయి. ఆ సమయంలో అవి ప్రదర్శించిన హావభావాలు.. కళ్లు తిప్పుకోకుండా చేశాయి.
ముఖ్యంగా మగ గొరిల్లా.. ఆడ గొరిల్లాలకు ఆ బాధ్యతను అప్పగించి.. తనకేమి పట్టనట్టు వ్యవహరించిన తీరు... నేటి సమాజంలోని పలువురు పురుషుల వైఖరిని తెలియజేసింది. తాను వర్షంలో తడవకుండా ఉండే చోటు కోసం ఆడ గొరిల్లాలు వెతగ్గా ముందు అవి వెళ్లిపోయాయి.
ఆ తర్వాత తీరిగ్గా మగ గోరిల్లా వెళ్లింది. నీళ్లు ఎక్కడ పడతాయో అన్నట్టుగా.. గోడకు ఆనుకుని వెళ్లింది. ఆ సమయంలో దాని ముఖాన్ని చూస్తే.. మనుషులు గుర్తుకు రాకమానరు. వర్షంలో తడవకూడదనుకునే వారు.. ముఖాన్ని ఎలా పెడతారో అచ్చం అలాగే అది కూడా పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను జూ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Pissing myself at gorillas making a run for it in the rain. Especially the