Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో విద్యార్థులు హాయిగా నిద్రపోవచ్చు.. జపాన్‌లో కొత్త పద్ధతి.. లైట్లు, ఫ్యాన్లు ఆపేస్తే నిద్ర వస్తుందా?

పాఠశాలలో ఉపాధ్యాయులు ఆసక్తిగా పాఠాలు చెపుతున్నపుడు శ్రద్ధగా వింటుంటాం. అదే మాస్టారు బోరుగా పాఠాలు చెబితే తరగతి గదిలో నిద్రరావడం ఖాయం. అటువంటప్పుడు పాఠం వినలేక... నిద్రపోలేక విద్యార్థులు నానా తంటాలు పడ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (12:49 IST)
పాఠశాలలో ఉపాధ్యాయులు ఆసక్తిగా పాఠాలు చెపుతున్నపుడు శ్రద్ధగా వింటుంటాం. అదే మాస్టారు బోరుగా పాఠాలు చెబితే తరగతి గదిలో నిద్రరావడం ఖాయం. అటువంటప్పుడు పాఠం వినలేక... నిద్రపోలేక విద్యార్థులు నానా తంటాలు పడుతుంటాం. అలాంటి సమయంలో పొరపాటున నిద్రపోయామంటే... అది కూడా మాస్టార్ కళ్లకి చిక్కితే అంతే సంగతులు.
 
అయితే విద్యార్థులు పడే బాధకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే పాఠశాలల్లో ఆటపాటలకు ఏ విధంగా సమయాన్ని కేటాయిస్తారో అలాగే.. విద్యార్థులు నిద్రపోయేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. దీని వల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు.. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
 
జపాన్‌లోని కకొగ్వా పట్టణంలో ఉన్న జూనియర్‌ హైస్కూల్‌ యాజమాన్యం ఇటీవల విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసి వారి నుంచి సలహాలు.. సూచనలు స్వీకరించింది. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం.. గ్లోబల్‌ వార్మింగ్‌.. విద్యుత్‌ ఆదా వంటి అంశాలకు సంబంధించి చక్కటి పరిష్కారం సూచించారు. మధ్యాహ్నం పూట కొంతసమయం విద్యార్థులు నిద్రపోయేందుకు అనుమతించి.. స్కూల్‌లో అన్ని లైట్లు.. ఫ్యాన్లు ఆపేయాలని కోరారు. 
 
దీనిద్వారా విద్యుత్‌ ఆదాతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని వెల్లడించారు. రెండు వారాల పాటు నిర్వహించే ఈ పనిలో ట్రయల్‌రన్‌లో విద్యార్థుల్లో మార్పులు కనిపిస్తే తమ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు చేయాలని చూస్తోంది. అంతేకాదు.. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ కొట్టాలి గురూ..! 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments