Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కుల్లో ఊరకే కూర్చుంటారా. అయితే వజ్రాలు మిస్ చేసుకున్నట్లే..

సాయంత్రం వేళల్లో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి పార్కుకు వెళ్లేది కాస్త సేద తీరుదామనే కదా.. కానీ ఆ కుర్రాడు సరదాకోసమో, సేద తీర్చుకోవడం కోసమో పార్కుకు వెళ్లలేదు. ఊరకే కూర్చోకుండా అలా తిరిగాడంతే.. ప్రపంచంలోనే పదో అతి విలువైన వజ్రం అమాంతంగా అతడి సొంతమైపోయ

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (02:56 IST)
సాయంత్రం వేళల్లో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి పార్కుకు వెళ్లేది కాస్త సేద తీరుదామనే కదా.. కానీ ఆ కుర్రాడు సరదాకోసమో, సేద తీర్చుకోవడం కోసమో పార్కుకు వెళ్లలేదు. ఊరకే కూర్చోకుండా అలా తిరిగాడంతే.. ప్రపంచంలోనే పదో అతి విలువైన వజ్రం అమాంతంగా అతడి సొంతమైపోయింది. అనంతపురం వజ్రకరూర్ ప్రాంతంలో వర్షం పడితే నేటికీ వందలాదిమంది రత్నాలు, రంగురాళ్ల కోసం వెటాడుతుంటారు. వాటిని కొనడానికి ముంబై, సూరత్ నుంచి వర్తకులు పరుగెత్తి వస్తారనుకోండి అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటన్న విషయం సియెర్రా లియోన్ గురించే. 
 
సియెర్రా లియోన్‌లోని మైన్స్‌లో పనిచేసే ఓ పాస్టర్‌కు 706 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. ఇప్పటిదాకా దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది పదో వజ్రమని చెబుతున్నారు. ఇక్కడి కొనొ ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చినవారిలో పాస్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ మొమో ఒకరు. 
 
తనకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాత అధికారికంగా విక్రయిస్తానని మొమో తెలిపారు. నాలుగు శాతం సొమ్మును తీసుకొని ప్రభుత్వమే అధికారికంగా దీనికి విలువ కూడా కడుతుందని, ఆ తర్వాత వజ్రాన్ని విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులను ఇస్తుందని, అప్పుడే అమ్మకానికి పెడతానని మొమో చెబుతున్నాడు.
 
ఇదిలాఉండగా అర్కాన్సాస్‌కు చెందిన ఓ బాలుడికి కూడా 7.44 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. ఇక్కడి స్టేట్‌ పార్క్‌ వజ్రాలకు ఫేమస్‌. దీంతో పార్క్‌లో వజ్రాల కోసం వెతికేందుకు వచ్చిన ప్రతిఒక్కరి దగ్గర 10 డాలర్ల సొమ్మును రుసుముగా వసూలు చేస్తారు. వజ్రాలు దొరుకుతాయనే ఆశతో కాకపోయినా సరదాగా విహరించేందుకు కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చినవారిలో 14 ఏళ్ల క్యాలెల్‌ లాంగ్‌ఫోర్డ్‌ను ఈసారి అదృష్టం వరించింది. 
 
గోధుమ రంగులో కనిపించిన ఓ రాయిని చేతిలోకి తీసుకున్న లాంగ్‌ఫోర్డ్‌.. సాధారణ రాయి కాదని గుర్తించి, తండ్రికి చెప్పడంతో చివరకు అది ఓ అరుదైన వజ్రమని తేలింది. అయితే ఇప్పటిదాకా ఈ పార్కులో దొరికిన 75000 వజ్రాల్లో ఇది ఏడో అతిపెద్ద వజ్రమని చెబుతున్నారు. అరుదైనది కావడంతో దీని విలువ సాధారణ వజ్రాల కంటే ఎక్కువే ఉంటుందని అంచనావేస్తున్నారు.
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments