Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు పేలిన గన్... ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:46 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గన్ కల్చర్‌కు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. దీంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. గురువారం రాత్రి ఇండియానాపోలిస్‌ పరిధిలోని ఫెడెక్స్‌ ఫెసిలిటీ ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించారు. ఈ ఘటన మరిచిపోక ముందే అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. 
 
టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా సమయం ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ వద్ద చోటుచేసుకుంది. అయితే కాల్పులు జరిపిన దుండగుడు.. అనంతరం తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలిస్తున్నామని.. సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ముందు జాగ్రత్తగా కాల్పులు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావద్దని పోలీసులు సూచించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
ఇదిలావుంటే.. గురువారం అమెరికాలోని ఇండియానాపోలిస్‌లోని పరిధిలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన 8 మందిలో భారత సంతతికి చెందిన నలుగురు సిక్కులు ఉన్నారు. క్షతగాత్రుల్లో భారత సంతతికి చెందిన ఓ యువతి కూడా ఉంది. 
 
కాగా.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఫెడెక్స్‌లో మాజీ ఉద్యోగి బ్రెండన్ హోలే (19) గా గుర్తించారు. పోలీస్ ఐడీతో ఆ ప్రాంతంలోకి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెడెక్స్ డెలివరీ సర్వీస్ ఫెసిలిటీలో 90 శాతం మంది కార్మికులు భారతీయ-అమెరికన్లు పనిచేస్తున్నారు. ఎక్కువగా సిక్కు వర్గానికి చెందినవారున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments