Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టంట్ చేస్తూ.. 62 అంత‌స్తుల భ‌వ‌నం నుంచి కిందపడి..?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీలపై యువతకు మోజు అమాంతం పెరిగిపోతుంది. అలాగే సాహసాలు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందనే ఆశతో.. స్టం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (15:21 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీలపై యువతకు మోజు అమాంతం పెరిగిపోతుంది. అలాగే సాహసాలు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందనే ఆశతో.. స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు ఓ చైనాకు చెందిన వ్యక్తి.
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వూ వాంగ్‌నింగ్ అనే వ్య‌క్తి పెద్ద పెద్ద భ‌వ‌నాల మీద నుంచి వేలాడుతూ సెల్ఫీలు తీసుకోవ‌డం, ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం వంటి వీడియోలు చేసి మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే ఈ స్టంట్స్ చేసేముందు వూ వాంగ్‌నింగ్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోడు. 
 
ఇటీవ‌ల హునాన్ ప్రావిన్స్‌లోని ఓ 62 అంత‌స్తుల భ‌వ‌నం పైనుంచి ఎక్స‌ర్‌సైజ్ స్టంట్ చేస్తుండ‌గా అనుకోకుండా ఏర్పడిన ప్రమాదంతో అతను కిందపడి  ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా వీడియోలో రికార్డ‌యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments