Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని పుర్రెను కూడా మిగల్చని పెంపుడు కుక్కలు... షాకైన పోలీసులు...

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (21:55 IST)
కుక్కలు ఎంతో విశ్వాసం కలిగి వుంటాయని అంటుంటారు. కానీ అవే కుక్కలు యజమానిని ఆహారంగా చేసుకున్నాయి. కనీసం అతడి పుర్రెను కూడా మిగలకుండా తినేశాయి. ఈ దారుణం జరిగిందని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు.
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని టెక్సాస్‌లో 57 ఏళ్ల ఫ్రెడ్డీ మ్యాక్ గత ఏప్రిల్ నెల నుంచి మిస్ అయ్యాడు. అతడి కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు తొలుత అతడు నివాసం వున్న ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో 18 కుక్కలున్నాయి. వాటిని ఫ్రెడ్డీ పెంచాడు. ఇంట్లో వున్న కుక్కలు పోలీసులను లోపలికి అడుగు పెట్టనీయలేదు. దానితో వాటన్నిటికీ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి లోపలికి ప్రవేశించారు పోలీసులు. ఇంట్లో అక్కడక్కడ ఎండిపోయిన రక్తపు మరకలు కనిపించాయి. 
 
కనిపించిన దృశ్యాలను బట్టి ఫ్రెడ్డీని ఎవరో చంపి వుంటారని ఆ కోణంలో దర్యాప్తు చేశారు. కానీ ఎక్కడా ఆనవాళ్లు దొరకలేదు. దానితో మరోసారి ఇంట్లోనే అడుగడుగునా గాలించారు. కుక్కలు విసర్జించిన మలంలో వెంట్రుకలు, చిన్నచిన్న ఎముకలు వుండటాన్ని గమనించారు. వాటిని డీఎన్ఎ టెస్టుకి పంపగా... అవి ఫ్రెడ్డీవేనని తేలింది. దీనితో పోలీసులు షాక్ తిన్నారు. ఫ్రెడ్డీని కుక్కలే తినేశాయని నిర్థారించారు. 
 
ఐతే అతడు చనిపోయిన తర్వాత తిన్నాయా... లేదంటే ఎవరైనా హత్య చేసి అతడిని కుక్కలకి వేశారా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. కానీ క్లూ దొరకలేదు. ఎందుకంటే ఆ కుక్కలు ఎవర్నీ ఇంట్లోకి రానీయవు. కనుక ఆ కుక్కలే అతడిని తినేశాయని కేసును మూసివేసారు పోలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments