Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మశానంలో ప్రియుడి శవానికి ముద్దులు పెట్టిన ప్రియురాలు... అదే తొలిసారి...

పింటరెస్ట్ ద్వారా వారిద్దరికీ పరిచయమైంది. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరస్పరం ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఇక లాభం లేదు... నిన్ను చూడనిదే వుండలేనన్నాడు ప్రియుడు. సరే వచ్చేయ్.. నేను ఎదురుచూస్తు

Webdunia
గురువారం, 13 జులై 2017 (16:25 IST)
పింటరెస్ట్ ద్వారా వారిద్దరికీ పరిచయమైంది. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరస్పరం ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఇక లాభం లేదు... నిన్ను చూడనిదే వుండలేనన్నాడు ప్రియుడు. సరే వచ్చేయ్.. నేను ఎదురుచూస్తుంటాను అంది ప్రియురాలు. ఆ మాటనేసరికి అతడికి ఆగలేకపోయాడు. ఆమెను చూసేందుకు కట్టలు తెంచుకునే ఉత్సాహంతో బయలుదేరుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతడు మరణించాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలో వుంటున్న 58 ఏళ్ల జాక్ మార్టిన్ లండన్‌లో వుంటున్న 43 ఏళ్ల హెలెన్ హంటర్ ప్రేమలో పడ్డారు. ఇరువురికీ పింటరెస్ట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జాక్ తన ప్రియురాలు హెలెన్ ను చూసేందుకు బయలుదేరే క్రమంలో గుండెపోటుతో మరణించాడు. తన ప్రియుడి మరణవార్త విన్న హెలెన్ వెంటనే లండన్ నుంచి అమెరికాలో అతడి నివాస ప్రాంతమైన అర్కాన్సాస్‌కు వచ్చింది.
 
నిర్జీవంగా పడి వున్న ప్రియుడి దేహం వద్దకు వెళ్లి ముద్దులు పెట్టింది. కాసేపు తలను నిమిరింది. అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అలా కాసేపు చూస్తుండిపోయింది. తన అనుభవాలను పంచుకుంటూ... జాక్ చనిపోలేదు. నవ్వుతూ నన్నే చూస్తున్నట్లున్నాడు అంటూ చెప్పుకుంది. తను లేకపోయినా అతడి జ్ఞాపకాలతో ఇలా బతికేస్తానని చెప్పింది హెలెన్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments