Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు గర్భవతి అని ప్రసవానికి ఒక్కరోజు ముందే తెలుసు..

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:17 IST)
గర్భవతి అని తెలిస్తే.. మహిళ ఆనందంలో మునిగిపోతుంది. నవమాసాలు మోసేవరకు మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ యువతి తాను గర్భవతినని తెలుసుకున్న మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకీ ఆమె గర్భవతినని తెలుసుకున్నది 39 వారాల తర్వాత కావడం గమనార్హం.
 
వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు మోలీ గిల్బర్ట్. 25 ఏళ్ల మోలీ నాటింగ్ హామ్ షైర్ లోని ట్రోవెల్ ప్రాంతంలో నివసిస్తుంటుంది. ఆమె సెప్టెంబరు 7న పండంటి మగ బిడ్డను ప్రసవించింది. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే... తాను గర్భవతినని ఆమెకు తెలిసింది కాన్పుకు ముందురోజేనట. 
 
సహజంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, వికారంగా ఉండడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే బ్రిటన్ యువతి మోలీ గిల్బర్ట్‌లో ఈ లక్షణాలేవీ లేకపోవడంతో తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇన్నాళ్ల పాటు ఆమె తెలుసుకోలేకపోయింది. కొంత బరువు పెరగడం తప్ప ఇతర మార్పులేవీ కనిపించలేదు.
 
ఆమె ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కొంతకాలంగా ఆసుపత్రికి వెళుతున్నా గానీ, ఆమె గర్భం సంగతి ఆసుపత్రి సిబ్బంది కూడా గుర్తించలేకపోయారు. 
 
తనకు బిడ్డ పుట్టడంపై మోలీ గిల్బర్ట్ స్పందిస్తూ ఆర్నెల్ల కిందటే సహజీవన భాగస్వామితో విడిపోయానని, గర్భం వచ్చే అవకాశాలే లేవని భావించానని పేర్కొంది. తన మాజీ భాగస్వామికి ఈ విషయం చెబితే అతడు నమ్మలేకపోయాడని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం