Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌ సర్కారుకు.. ఆర్మీ చీఫ్‌కు మధ్య విభేదాలు... తిరుగుబాటు తప్పదా?

ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్‌లో మరోమారు సైనిక తిరుగుబాటు తప్పదనే వార్తలు వినొస్తున్నాయి.

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (08:49 IST)
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్‌లో మరోమారు సైనిక తిరుగుబాటు తప్పదనే వార్తలు వినొస్తున్నాయి. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతండాలపై మెరుపు దాడులు జరిపిన పదుల సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయంతెల్సిందే. దీన్ని పాకిస్థాన్‌తో పాటు.. ఆ దేశ ఆర్మీ, ఉగ్ర సంస్థలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. దీంతో ప్రతి దాడులకు వ్యూహాలు రచిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలు తూర్పారబడుతున్నాయి. ఈ విషయంలో ఆ దేశం ఏకాకి అవుతోంది. దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో సైన్యం జోక్యం చేసుకోవద్దంటూ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 
 
దీంతో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్‌కు చెందిన డాన్‌ వార్తా పత్రిక కథనం ప్రకారం.. ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సహా ఆ దేశ ప్రజా ప్రతినిధులు, సైనికాధికారులు, ఐఎస్ఐ చీఫ్‌ రిజ్వాన్‌ అఖ్తర్‌ల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వాడివేడి వాదోపవాదాలు జరిగాయి. 
 
పాకిస్థాన్‌ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరి అయిందని, జైషే మహ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి ఐజాజ్‌ చౌదరి స్పష్టం చేశారు. ఐఎస్ఐ చీఫ్‌ కూడా అంతేగట్టిగా వాదించడంతో వివాదం ముదిరింది. దీంతో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగించారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని అమెరికా, రష్యా, చైనా పాక్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. 
 
ముంబై దాడుల కేసు పునర్విచారణ, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిపై విచారణ, సొంతగడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే వరకూ చర్చలకు ఆస్కారం లేదని భారత స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదులకు అండగా నిలవడంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ ఏకాకి అవడాన్ని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉగ్రవాదులకు సహకారాన్ని నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, సైన్యం నిలిపివేయాలని గట్టిగా కోరుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments