Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను పైకి వదులుతామని బెదిరించి... బాలికపై గ్యాంగ్ రేప్... ఎక్కడ

తమ వద్ద ఉన్న కుక్కను పైకి వదులుతామని బెదిరించి ఓ బాలికను బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఒకటి చికాగోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే అమెకాలోని చికాగోలో ఇంట్లో నుంచి ష

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (11:09 IST)
తమ వద్ద ఉన్న కుక్కను పైకి వదులుతామని బెదిరించి ఓ బాలికను బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఒకటి చికాగోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే అమెకాలోని చికాగోలో ఇంట్లో నుంచి షాపింగ్ మాల్‌కు వెళ్లిన 15 ఏళ్ల బాలికను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. 
 
ఆ తర్వాత ఆ బాలికను నిర్బంధించి, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ యువతి ఆ కామాంధులతో ప్రతిఘటించింది. దీంతో తమ వెంటవున్న కుక్కను వదులుతామని వారు బెదిరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు 14 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్నారు. బాధిత బాలికకు ఈ ఇద్దరు తెలిసిన వాళ్లే కావడం గమనార్హం. 
 
బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మహా గార్డ్‌నర్ వెల్లడించారు. బాలిక షాపింగ్‌కు వెళ్తుంటే ఆమెను వెంబడించారు. అనంతరం దగ్గర్లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అ‍త్యాచారానికి పాల్పడ్డారు. బాలుర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తమ వద్ద ఉన్న కుక్కను ఆమె మీదకి వదులుతామని బెదిరించి  పారిపోకుండా చేశారని బాధితురాలు కోర్టులో తన ఆవేదన వెల్లగక్కింది. తనను చాలాసార్లు చెంపదెబ్బలు కొట‍్టారని కన్నీటి పర్యంతమైంది.
 
మైనర్లు ఈ అకృత్యానికి పాల్పడిన సమయంలో ఫేస్‌బుక్ లైవ్ పెట్టారని, దాదాపు 40 వేల మంది వీడియో చూశారని.. అయితే ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని చికాగో పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫేస్‌బుక్ పేజీ ఆధారంగా బాలురను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ తర్వాత వీడియోను కొన్ని ఫేస్‌బుక్ అకౌంట్లలో పోస్ట్ చేశారని, ఇది చాలా దారుణ విషయమని తప్పుచేసింది మైనర్లు అయినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. మైనర్లు అయినందున వారి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం