Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సంతకాన్ని పార్టీ నేతలు ఫోర్జరీ చేసే ఛాన్స్ : బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:53 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కూడా ఓ లేఖ రాశారు. 
 
ప్రస్తుతం అనారోగ్యం కారణంగా జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయంతెల్సిందే. దీన్ని అవకాశం తీసుకుని ముఖ్యమంత్రి జయ సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
శశికళ లేఖ నేపథ్యంలో, తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలనే వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. అంతేకాదు, జయలలితకు ఏమీ తెలియని స్థితిలో తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు, ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి కోర్టు కేసును శశికళ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments