Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో స్నేహితులపై కాల్పులు... బీరు తాగుతూ.. దాచుకున్న తుపాకీతో.. ఒకరి మృతి

అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన జరిగింది. అమెరికా శాన్‌డియాగోలో ఏడుగురు నల్లజాతీయులపై జాతి విద్వేష కాల్పులు జరిగాయి. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (08:54 IST)
అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన జరిగింది. అమెరికా శాన్‌డియాగోలో ఏడుగురు నల్లజాతీయులపై జాతి విద్వేష కాల్పులు జరిగాయి. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. స్నేహితుడు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఏడుగురు నల్లజాతీయులపై ఈ కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు. నిందితుడిని పీటర్‌ సెలీస్‌గా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పీటర్‌ సెలీస్‌ (47) కూడా అదే ఆ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. 
 
పార్టీలో పాల్గొన్న స్నేహితుల్లో ఒక శ్వేతజాతీయుడు... బీరు తాగుతూ, తన వద్ద దాచుకున్న తుపాకీని తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడివారు తమని తాము రక్షించుకోవడానికి ప్రాణభయంతో పరుగులు తీశారు. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇంతకు ముందే నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments