అభిశంసనకు గురైన దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌కి అధినేత లీజే యాంగ్‌కి జైలు తప్పేలా లేదు. అధికారి
అభిశంసనకు గురైన దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌కి అధినేత లీజే యాంగ్‌కి జైలు తప్పేలా లేదు. అధికారికంగా సామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ పదవిలో ఉన్న లీ ని గతవారం అధికారులు 22 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేయాల్సిందిగా విచారణాధికారులు స్థానిక కోర్టును కోరినట్లు తెలుస్తోంది. వీరి దరఖాస్తును న్యాయస్థానం బుధవారం పరిశీలించనుంది.
అధ్యక్షురాలి సన్నిహితులకు లంచంగా సంస్థ డబ్బు ఇవ్వమని లీ తన ఎగ్జిక్యూటివ్స్‌కి తెలిపాడని విచారణలో తేలింది. 'జాతీయ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం.. న్యాయాన్ని కాపాడడం అంతకన్నా ముఖ్యం..' అని స్వతంత్ర విచారణ సంస్థ అధికార ప్రతినిధి లీ క్యూ చుల్ వెల్లడించారు. ఇప్పటికే లీని అదుపులోకి తీసుకోవడానికి అనుమతులు పొందినట్లు సమాచారం. మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జీషీటు దాఖలు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లు క్యూ చుల్ తెలిపారు.