Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లపై 'ఓం' గుర్తు... పాకిస్థాన్‌లో వ్యాపారుల దుశ్చర్య.. నిరసన తెలుపుతున్న హిందువులు

పాకిస్థాన్‌లో హిందువుల దేవతా చిహ్నంగా పూజిస్తున్న 'ఓం' ను షూలపై ముద్రించి వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలు కలకలం సృష్టిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తూ.. రోజు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (12:16 IST)
పాకిస్థాన్‌లో హిందువుల దేవతా చిహ్నంగా పూజిస్తున్న 'ఓం' ను షూలపై ముద్రించి వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలు కలకలం సృష్టిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తూ.. రోజు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న అక్కడ మైనారిటీలుగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న హిందువులు ఇప్పుడు తమ మనోభావాలకు భంగం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 
 
జేబ్ షూస్ అనే సంస్థ వాటిని సింథ్ ప్రాంతంలో అమ్ముతుండగా అక్కడి వారు అడ్డు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో అక్కడ షాపింగ్ జోరుజోరుగా సాగుతుంది. కాగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ షూల వ్యాపారంపై నోరుమెదపలేని కఠిన పరిస్థితి హిందువులకు ఏర్పడింది. అయితే విషయం తెలుసుకున్న 'పాకిస్థాన్ హిందూ కౌన్సిల్' ప్రతినిధి రమేష్ కుమార్ రంగంలోకి దిగి.. సింథ్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
 
ప్రస్తుతం ఓం గుర్తుతో ఉన్న షూల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓం గుర్తుతో ఉన్న షూల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, వీటిని తక్షణం దుకాణాల నుంచి తొలగించాలని పాక్ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 'పాకిస్థాన్ హిందూ కౌన్సిల్' ఈ విషయంపై అందరికి అవగాహన కలిగేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లను పెట్టి, వాటిని షేర్ చేయాలంటూ కోరుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments