షాకింగ్ విజువల్స్... రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది దుర్మరణం

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (10:25 IST)
రష్యాలో సైనిక విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్ 76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఈ విమానం కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇననోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్టు తెలిపింది. కాగా గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్ తమ ఐఎల్ 76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ యేడాది జనవరి నెలలో ప్రటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments