Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌కు సాయం చేస్తామంటున్న భారత్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (16:59 IST)
రష్యా దండయాత్ర కారణంగా తీవ్రంగా ధ్వంసమైన ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్ట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అదేసమయంలో ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ మరింతగా దిగజారిపోతున్నాయి. వీటిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని అందిస్తామని తెలిపింది. 
 
ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న మానవ సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు పలు దేశాల విన్నపం మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. 
 
ఇందులో తిరుమూర్తి మాట్లాడుతూ, ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని గుర్తుచేశారు. 
 
ఆ దేశంలోని మానవతా పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తుందని, ఉక్రెయిన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమస్యను రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య దౌత్య విధానాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments