Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం : వ్లాదిమిర్ పుతిన్

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (15:02 IST)
తమ దేశ శాస్త్రవేత్తలు కేన్సర్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ టీకా తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మాస్కోలో భవిష్యత్తు టెక్నాలజీలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేన్సర్ వ్యాక్సిన్‌, రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నాం. రాబోయే రోజుల్లో వీటిని చికిత్సల్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ ఏ విధమైన కేన్సర్లను నయం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. 
 
ఇప్పటికే పలు దేశాలు వివిధ రకాల కేన్సర్‌లను టీకాలను తయారు చేస్తున్నాయి. బ్రిటన్‌ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అనే సంస్థతో కేన్సర్‌ వ్యాక్సిన్‌ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి పదివేల మంది రోగులకు దీన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పలు రకాల కేన్సర్లకు కారణమయ్యే హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ కట్టడికి, కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే హెపటైటిస్‌-బి నివారణకు అవసరమయ్యే ఆరు వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి.
 
కాగా, భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం దేశంలో 2026 నాటికి 20 లక్షల మంది దీని బారిన పడే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో 2019లోనే 12 లక్షల కేన్సర్‌ కేసులు నమోదు కాగా, 9.3 లక్షల మంది మరణించారని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. రష్యా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే.. భారత్‌లో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments