Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగుతీస్తే కన్యత్వం పోతుందట: ఆస్ట్రేలియాలో దుమారం!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:49 IST)
పరుగుతీస్తే కన్యత్వం పోతుందని.. ఓ కళాశాల నిషేధం విధించడం ఆస్ట్రేలియా దుమారం రేపింది. ఆస్ట్రేలియాలోని ఓ ఇస్లామిక్ కళాశాల విద్యార్థినులపై విచిత్ర నిషేధం విధించింది. అమ్మాయిలు పరుగులు పందాల్లో పాల్గొన కూడదని మెల్ బోర్న్‌లోని అల్ తక్వా కాలేజ్ ప్రిన్స్‌పాల్ ఆదేశాలు చేశారు. అలా పరుగు పందాలలో పాల్గొంటే కన్యత్వం పోతుందని పేర్కొన్నారు
 
కాగా అల్ తక్వా కళాశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ తీరుపై ఓ మాజీ ఉపాధ్యాయుడు ప్రభుత్వానికి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలు అధికంగా పరిగెడితే, వారు కన్యత్వం కోల్పోతారని ప్రిన్సిపాల్ భావిస్తున్నాడని, అందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని ఆయన నమ్ముతున్నాడని మాజీ ఉపాధ్యాయుడు తన లేఖలో పేర్కొన్నారు. 
 
దీనిపై... విక్టోరియా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జేమ్స్ మెలినో మాట్లాడుతూ... ఆ విధమైన నిషేధం విధించడం నిజమే అయితే, అది ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై పాఠశాలల రెగ్యులేటర్, విక్టోరియా రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్ అథారిటీని విచారణ జరపాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?