Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోలర్ కోస్టర్‌లో జర్నీ.. సాంకేతిక లోపంతో ఆగిపోయింది.. అందరూ.. తలకిందులుగా? (video)

రోలర్ కోస్టర్‌లో జర్నీ ఓ థ్రిల్ అనుభూతినిస్తుంది. అమ్యూజ్‌మెంట్ పార్కులలో రోలర్ కోస్టర్‌లో ఎక్కి కూర్చుని.. అది తల్లకిందులైనప్పుడు భయంతో కేకలు వేస్తూ ఆ అనుభవాన్ని చాలామంది ఆస్వాదిస్తారు

Webdunia
బుధవారం, 5 జులై 2017 (09:50 IST)
రోలర్ కోస్టర్‌లో జర్నీ ఓ థ్రిల్ అనుభూతినిస్తుంది. అమ్యూజ్‌మెంట్ పార్కులలో రోలర్ కోస్టర్‌లో ఎక్కి కూర్చుని.. అది తల్లకిందులైనప్పుడు భయంతో కేకలు వేస్తూ ఆ అనుభవాన్ని చాలామంది ఆస్వాదిస్తారు. కానీ రోలర్ కోస్టర్ కొంతమందికి రోలర్ కోస్టర్ భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని మైల్ ఓక్ ప్రాంతంలో డ్రేటాన్ మానర్ థీమ్ పార్కు ఉంది. అందులోని జీ- ఫోర్స్‌ రోలర్‌ కోస్టర్‌ సందర్శకులను ఎక్కించుకుని పరుగులు తీస్తుండగా.. మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అందులో పయనించిన వారంలో తల్లకిందులుగా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
రోలర్ కోస్టర్ సాంకేతిక లోపంతో తలకిందులుగా ఆగిపోవడంతో.. అందులో ప్రయాణించిన వారికి చుక్కలు కనిపించాయి. ఒక్కసారిగా అందులోని వారంతా భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. చేతులూపుతూ తమను రక్షించాలని కోరారు. దీంతో పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని జాగ్రత్తగా కిందికి దించారు. దీనిని ఒక వ్యక్తి దూరం నుంచి వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments