Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషి సునక్‌కు 'మార్గరెట్ థాచర్ 2.O' నుంచి పొంచివున్న ముప్పు

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (09:46 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో భారత సంతతి మూలాలున్న ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ దూసుకుపోతున్నారు. అయితే ఇపుడు అనూహ్యంగా ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు ఓ మహిళ తెరపైకి వచ్చారు. ఆమె పేరు లిజ్ ట్రస్. ఆమె అచ్చం మార్గరెట్ థాచర్ ఆహార్యాన్ని కలిగివుంటారు. దీంతో ఆమెను అందరూ మార్గరెట్ థాచర్ 2.Oగా పిలుస్తుంటారు. 
 
ప్రస్తుతం ఈమె బ్రిటన్ విదేశాంగ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి ఎంపిక చివరి దశలో కన్జర్వేటివ్ పార్టీ నుంచి రిషి సునక్‌కు లిజ్ ట్రస్ గట్టి పోటీని ఇస్తున్నారు. ఈమె 1996 నుంచి ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 2010 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు పెన్షన్లు, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతలకు సంబంధించి అక్కడి వ్యాపారులు, ఉద్యోగులు నేషనల్ ఇన్సూరెన్స్‌ కింద పన్ను చెల్లిస్తుంటారు.
 
తాను ప్రధాని అయితే, ఈ పన్ను రద్దు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈ రేసులో రిషి సునక్‌ను వెనక్కినెట్టి ఆమె విజయం సాధిస్తే బ్రిటన్ ప్రధాని బాధ్యతలను చేపట్టే మూడో మహిళ అవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments