Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు... హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి

వచ్చే నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడికావొచ్చని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. ఈ సర్వే ఫలితాలు అమెరికాలో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా డమోక్రటిక్ పార్టీ అభ్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (18:38 IST)
వచ్చే నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడికావొచ్చని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. ఈ సర్వే ఫలితాలు అమెరికాలో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా డమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గండి కొట్టవచ్చని పేర్కొంది. 
 
ఈ సర్వేను ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించింది. ఇందులో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. ఎన్నికల్లో అక్రమాలు(రిగ్గింగ్) జరుగుతున్నాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది. 
 
అక్టోబర్ 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకున్నారని, అదే సమయంలో హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ఆ మాత్రం తేడాను కూడా ట్రంప్ అధిగమిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments