Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త సంచికను విడుదల చేసిన 'ప్లేబాయ్' మ్యాగజైన్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:07 IST)
'ప్లేబాయ్' మ్యాగజైన్ కొత్త శకంలోకి ప్రవేశించింది. నగ్న ఫోటోలు లేని తొలి సంచికను న్యూయార్క్‌లో శుక్రవారం విడుదల చేసింది. చూపురులను ఇట్టే ఆకర్షించే విధంగా ప్లేబాయ్ వ్యవస్థాగతంగా ఈ తరహా మార్పులు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే న్యూడ్ ఫోటోలు లేకుండా కొత్త సంచికను మార్కెట్లోకి రీలీజ్ చేసింది. నగ్న చిత్రాలతో పాటు కార్టూన్లు, అడల్ట్ జోకులను సైతం పక్కన పెట్టేసింది. 
 
కొత్తగా రిలీజైన సంచికలో పేపర్ నాణ్యతను కూడా ఏకధాటిగా పెంచేశారు. ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాట్లాడుతూ.. ఒక్క నగ్న ఫోటోలు మినహా మిగిలిన పత్రిక మొత్తం యధావిధిగా పాఠకులను మెచ్చే విధంగా ఉంటుందన్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలకు హద్దు లేకుండా మితిమీరిపోయింది అని పేర్కొన్నారు. న్యూడ్ ఫోటోలు లేకున్నా మరో తరహా స్కిన్ షో ఉంటుందని తెలిపారు.
 
కొత్త విధానాన్ని చేపట్టడం ద్వారా అడ్వటైజర్లను ఆకట్టుకోవచ్చన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక ఎడిటర్లు వ్యక్తం చేస్తున్నారు. నగ్న ఫోటో రహిత తొలి సంచిక కవర్ పేజీ ఫోటోలో సోషల్ మీడియా స్టార్ సారాహ్ మెక్ డానియల్ మెరిసిపోయింది. న్యూడ్ ఫోటోలు లేని ఎడిషన్‌ను రిలీజ్ చేయాలని ప్లేబాయ్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే ఆ పత్రిక పాఠకులు వందల సంఖ్యలో తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. కానీ కొత్త సంచికకు గుర్తింపు వస్తుందని ఎడిటర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments