Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (15:32 IST)
తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా ఓ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌లో పర్యటించరాదని హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాలకు అస్సలు వెళ్లవద్దని కోరింది. ఆయా  ప్రావిన్స్‌లలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. 
 
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్ళొద్దని కోరింది. ఆయా ప్రావిన్స్‌లలో ఎపుడు ఎక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనేది  చెప్పలేమని, పౌరులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్ర కార్యకలాపాలతో పాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. పాకిస్థాన్ వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 
 
మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాల్లో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. ఇందులో లైఫ్ ఆఫ్ కంట్రోల్ ఏరియాకు అస్సలు ప్రయాణించవద్దంటూ లెవల్ 4 హెచ్చరికలను జారీచేసింది. సరిహద్దుల్లో మిలిటెంట్ గ్రూపులు దాడులు చేయొచ్చని, సరిహద్దులకు రెండు వైపులా రెండు దేశాలు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మొహరించాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments