Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో నేడు ఇద్దరికి.. రేపు మరో ఇద్దరికి ఉరిశిక్షల అమలు!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:12 IST)
కామాంధులపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా మంగళవారం ఇద్దరికీ.. రేపు మరో ఇద్దరికీ ఉరిశిక్షను అమలు చేయనుంది. అత్యాచారాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించే పాకిస్తాన్ నేడు ఇద్దరు రేపిస్టులకు ఉరిశిక్ష అమలు చేసింది. రేపు మరో ఇద్దరిని ఉరితీయనుంది. 
 
అత్యాచారం కేసులో దోషులుగా తేలిన పలువురికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్షలను విధించింది. అయితే, తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ వీరు పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌ను ఆ దేశ అధ్యక్షుడు తిరస్కరించారు. దీంతో ఉరిశిక్షను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. 
 
ఇందులోభాగంగా మంగళవారం ఉదయం ఇద్దరు దోషులు సలీమ్, నౌమన్‌లకు సియల్ కోట్ జిల్లా జైలులో అధికారులు ఉరిశిక్షను అమలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు దోషులు అబిద్ మసూద్, సన్హుల్లాలకు బుధవారం ఉరి శిక్షను అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 
 
1999లో మైనర్‌‌పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో సలీం, నౌమన్‌లకు, 1997లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసినందుకు అబిద్, నన్హుల్లాలకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లో ఉరి అమలుపై నిషేధం మొదలవగా, వీరు దీర్ఘకాలంపాటు జైల్లో గడపాల్సి వచ్చింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments