Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గర్భం.. నా యిష్టమంటే కుదరదు.. ఎన్నారై మహిళకు 20 యేళ్ల శిక్ష అమెరికా కోర్టు తీర్పు

Webdunia
బుధవారం, 25 మే 2016 (12:57 IST)
పెళ్లయిన వ్యక్తితో అక్రమంగా ఓ ఎన్నారై యువతి లైంగిక సంబంధం పెట్టుకుంది. ఇండియానా రాష్ట్రంలో నివసించే పూర్వీ పటేల్ అనే 33 యేళ్ల ఇండో- అమెరికన్ మహిళ... తన కోవర్కర్‌తో లవ్‌లో పడి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఇంట్లో వాళ్లకి తాను గర్భవతి అని తెలిస్తే తల్లిదండ్రులు తన అసహ్యించుకుంటారని దీంతో ఎలాగైనా గర్భాన్ని తొలగించాలనుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా గర్భాన్ని తొలగించే మందులను ఆర్డర్ చేసి తెప్పించుకుంది.

ఇంట్లో ఎవరు లేని సమయం చూసి మందులతో బాత్రూమ్‌లో గర్భాన్ని తొలగించింది. వెంటనే నేరుగా ఆసుపత్రికి వెళ్లకుండా ఆ  ఒకటిన్నర పౌండ్ బరువున్న ఆ పిండాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి దాన్ని ఓ చెత్తకుండీలో పారేసి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లింది. అప్పటికి పూర్వీ పటేల్‌కు ఇంకా రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఎమర్జన్సీ రూమ్‌లో డాక్టర్లు ఆమెకు వైద్య చికిత్సలు చేసినప్పటికీ తన గర్భంలోనే పిండాన్ని చిదిమేసిందనే ఆరోపణపై ఆమె మీద కేసు నమోదైంది. కొద్ది రోజుల తర్వాత పిండాన్ని గమనించిన పనిమనుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫోటోల సహాయంతో పూర్వీని గుర్తించారు. 
 
అంతేకాక ఆమె ఆన్‌లైన్ ద్వారా గర్భం పోగోట్టే మందులు కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో పూర్వీపై కేసు పోలీసులు కేసు నమోదుచేశారు. అనంతరం పోలీసులు పూర్వీని కోర్టులో హాజరుపరిచారు. కానీ విచారణకు కోర్టులో వచ్చిన పూర్వీ తన గర్భం.. తన ఇష్టమంటూ కోర్టులో వాదించింది. అయితే వ్యక్తుల ఇష్టాయిష్టాలతో చావుకు సంబంధం లేదని, పౌరులకు జీవించే హక్కును ఎవరూ తమంతట తాముగా తొలగించుకోకూడదని కోర్టు వెల్లడించింది. విచారణలో ఆమెను నిందితురాలుగా పేర్కొంటూ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం