Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో భారత్‌లో అడుగుపెడతాం.. సౌత్ కొరియా కంపెనీ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:02 IST)
చైనాకు చెందిన 118 యాప్‌ల తొలగింపులో భాగంగా పబ్జీని కూడా ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. తిరిగి భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నట్టుగా తెలిపింది. 
 
తాము పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో అడుగుపెడతామని ధీమాగా చెప్తోంది.  చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది.  
 
వాస్తవానికి పబ్జీ గేమ్‌ను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ తయారు చేసింది. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. దీంతో భారత్‌లో ఈ వర్షన్‌పై నిషేధం విధించారు. ఈ చర్యతో సౌత్ కొరియా కంపెనీ దిగివచ్చింది. 
 
ఇక నుంచి తమ గేమింగ్ యాప్‌తో టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments