Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయానా పెళ్లైన పది రోజుల్లోనే ఆ పని చేసిందా? వీడని మిస్టరీ...

బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1981లో ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఈమె మరణంపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన పది రోజుల

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (12:15 IST)
బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1981లో ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఈమె మరణంపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. 
 
పెళ్లైన తర్వాత చాలా మానసిక ఒత్తిడికి డయానా లోనైందని.. ఇందుకు కారణం.. భర్త చార్లెస్‌తో పాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని బహిర్గతమైంది. పెళ్లైన పది రోజుల్లోనే డయానా తన రెండు చేతుల మణికట్టులను రేజర్‌ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. 
 
ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు ఉన్నట్లు తెలిసింది. తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని.. తాను రేజర్ బ్లేడులతో తన చేతుల మణికట్లను తెగ్గోసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని డయానా ఈ ఘటనకు పాల్పడుతూ తన వాయిస్‌ను రికార్డు చేసుకుంది. ఈ ఘటన 1991 ప్రాంతంలో రికార్డైనట్లు సమాచారం. 
 
ఈ రికార్డులన్నీ డయానా స్నేహితురాలి సాయంతో ఇన్నాళ్లు భద్రంగా వున్నాయని.. అయితే ప్రస్తుతం బహిర్గతం అయ్యాయని బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి.  గతంలోనే డయానాపై మోర్టన్‌ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా తాజాగా విడుదల చేస్తున్న పుస్తకంలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments