Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేయరు: ఒబామా క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన సతీమణి మిచెల్లీ ఒబామా రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. 2020లో​ జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ బరిలో ఉండరని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబా

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (12:08 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన సతీమణి మిచెల్లీ ఒబామా రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. 2020లో​ జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో  మిచెల్లీ బరిలో ఉండరని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లీ 2020 సంవత్సరంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ ఉండరని ఆయన స్పష్టం చేశారు.
 
మిచెల్లీ చాలా ప్రతిభావంతురాలని ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి అయినప్పటికీ.. అధ్యక్ష రేసులో మాత్రం లేరని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం మిచెల్లీకి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడమేనని ఒబామా వివరణ ఇచ్చారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిస్తే... మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారనే కథనాలు కూడా గతంలో వెలువడ్డాయి.
 
ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోవడంతో... వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేస్తారని కథనాల్లోనూ నిజం లేదని ఒబామా క్లారిటీ ఇచ్చారు. మిచెల్లీకి రాజకీయాలపై.. పదవులపై మోజు లేదని స్పష్టం చేశారు. తన భార్య తెలివైనదని, ఆమెను చూస్తే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments