''నేను ముసలివాడిని అయిపోతున్నాను.. మాట్లాడేది వినిపించడం లేదు" : బరాక్ ఒబామా
''నేను ముసలివాడిని అయిపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదు. మీరెవరో నాకు సరిగా కనిపించడం లేదు. మీ సమస్య ఏదైనా నాకు రాసి పంపండి. పరిష్కరిస్తాను'' ఇవి ఒక మహిళనుద్దేశించి అమెరికా అధ్యక
''నేను ముసలివాడిని అయిపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదు. మీరెవరో నాకు సరిగా కనిపించడం లేదు. మీ సమస్య ఏదైనా నాకు రాసి పంపండి. పరిష్కరిస్తాను'' ఇవి ఒక మహిళనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఒహాయోలో జరిగిన కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్ను ఒబామా హిల్లరీకి ఓటు వేయాలని కోరారు. ఇంతలో కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. అంతలో ఒక మహిళ.. ఒబామాను ఉద్దేశించి ''మాకు పైప్‌లైన్ వద్దు'' అంటూ మరింత గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో ఒబామాపై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమెను భద్రతా సిబ్బంది బయటికి లాక్కెళ్లిపోయారు.