Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై పారుతున్న రెడ్ వైన్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (21:42 IST)
Red Wine
పోర్చుగల్ నైరుతి ఐరోపాలోని ఒక దేశం. దీని రాజధాని లిస్బన్. అనాడియా మునిసిపాలిటీ రాజధాని నుండి 240 కిలోమీటర్ల దూరంలో సావో లౌరెన్‌కో డో పిర్రో ప్రాంతం వుంది. దాదాపు 2,000 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో డెస్టిలేరియా లెవిరా అనే డిస్టిలరీ నడుస్తోంది. 
 
ఈ కర్మాగారంలో, నల్ల ద్రాక్ష నుండి రెడ్ వైన్ ప్రాసెస్ చేయబడుతుంది. ఇక్కడ వారు తయారుచేసే వైన్ చాలా పెద్ద పీపాలలో నిల్వ చేయబడుతుంది. ఈ క్రమంలో ఇలా నిల్వ ఉంచిన రెండు పీపాలు విరిగిపోవడంతో అందులోని వైన్ రోడ్లపైకి దూసుకెళ్లింది. 
 
ఈ వైన్ రక్తపు నదిలా ఎర్రగా ప్రవహిస్తూండగా, దీనిని చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లీకైన వైన్ పరిమాణం దాదాపు 20 లక్షల లీటర్లు (2.2 మిలియన్ లీటర్లు) ఉంటుందని, దాదాపు 20 లక్షల వైన్ బాటిళ్ల సామర్థ్యం కలిగి ఉంటుందని ఆ దేశ పత్రికలు అంచనా వేస్తున్నాయి. పట్టణంలోని సెర్టిమా నదిలో ప్రవహించే ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మధు నది ప్రవాహాన్ని అడ్డుకుని అక్కడి పొలంలోకి మళ్లించారు. 
 
ఈ దురదృష్టకర సంఘటనకు, దాని వల్ల జరిగిన నష్టానికి తామే బాధ్యులమని, పట్టణాన్ని శుభ్రం చేయడానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని డిస్టిలేరియా లెవిరా పేర్కొంది. సోషల్ మీడియాలో వీడియో చూసిన మద్యం ప్రేమికులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments