Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ దిగిచేతిలో ఐస్‌క్రీమ్ పెట్టాడు.. ఆరగించి ఆస్పత్రి పాలైన టీవీ యాంకర్... ఏం జరిగింది?

ఓ అభిమాని ఆత్మీయంగా ఇచ్చిన ఐస్‌క్రీమ్ తిని టీవీ యాంకర్ ఆస్పత్రి పాలైంది. సెల్ఫీ తీసుకుని, ఆటోగ్రాఫ్ పెట్టించుకుని, చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ బహుమతిగా ఇవ్వగా అది ఆతృతగా ఆరగించిన ఆ టీవీ యాంకర్ ఆసుపత్రి పాల

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:30 IST)
ఓ అభిమాని ఆత్మీయంగా ఇచ్చిన ఐస్‌క్రీమ్ తిని టీవీ యాంకర్ ఆస్పత్రి పాలైంది. సెల్ఫీ తీసుకుని, ఆటోగ్రాఫ్ పెట్టించుకుని, చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ బహుమతిగా ఇవ్వగా అది ఆతృతగా ఆరగించిన ఆ టీవీ యాంకర్ ఆసుపత్రి పాలైంది. ఆ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌లో అబ్‌తక్ ఉర్దూ న్యూస్ ఛానల్ హోస్ట్ సనా ఫైజల్‌కు ఆదివారం రాత్రి చేదు సంఘటన ఎదురైంది. ఆమె తన భర్తతో కలిసి ఐస్‌‌క్రీమ్ పార్లర్‌కు వెళ్ళారు. అంతలోనే అభిమానినంటూ నమ్మకంగా ఓ 15 యేళ్లు కుర్రాడు వారి దగ్గరకు వచ్చాడు. సెల్ఫీ ప్లీజ్ అన్నాడు. ఆమె సరేనని అతనితో సెల్ఫీ దిగింది. 
 
ముచ్చటపడుతున్నాడని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆ బాలుడు తన చేతిలోని ఐస్‌క్రీమ్‌ను ఆమెకు ఇచ్చాడు. అభిమాని ఇచ్చాడనే సరదాతో ఆమె దాన్ని తినేసింది. భర్తతో కలిసి మళ్ళీ ఇంటికెళ్ళేటపుడు ఆమెకు ఏదో అనారోగ్యం అలముకున్నట్లు అనిపించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స చేయించుకుంది. కరాచీ పోలీసులు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, ఆ బాలుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments