Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వంద మంది ఉగ్రమూకలను వెతికిపట్టుకోండి.. లేకుంటే విధ్వంసమే: పాక్

సర్జికల్ స్ట్రైక్స్‌కి తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ సర్కారు సన్నాహాలు చేసింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పోలీసులకు ఇప్పటికే పాక్ సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భవాల్పూర్, ఫైసలాబాద్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (18:21 IST)
సర్జికల్ స్ట్రైక్స్‌కి తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ సర్కారు సన్నాహాలు చేసింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పోలీసులకు ఇప్పటికే పాక్ సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భవాల్పూర్, ఫైసలాబాద్, ముల్తాన్, రావల్పిండి, డేరా ఘజిఖాన్ డివిజన్లకు చెందిన 102 మంది ఉగ్రవాదుల ఆచూకీ  కనిపించకుండా పోయింది. వీరిని వెతికి పట్టుకోవాలని రావల్పిండి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాక్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకముందే వారిని అరెస్ట్ చేసేందుకు పాక్ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ఒకవేళ వారిని అదుపులోకి  తీసుకోకపోతే, 2013లో రాజాబజార్‌లో జరిగిన విధ్వంసం లాంటి ఘటన పునరావృతమయ్యే అవకాశం ఉందని పాక్ సర్కారు హెచ్చరించింది. ఆ ఘటనలో 13 మంది పౌరులు దుర్మరణం పాలైన సంగతిని పాక్ సర్కారు గుర్తు చేసింది. మొహరం సందర్భంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో వారిని అదుపులోకి తీసుకునే దిశగా పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments