Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌తో పాటు మెలానియా కొత్త రికార్డ్: నన్ను క్షమించండి.. ట్రంప్‌కు అభినందనలు.. హిల్లరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. రాజకీయంగా ఎటువంటి పదవులు చేపట్టకుండా నేరుగా అమెరికా అధ్యక్షుడైన తొలి వ్యక్తిగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌త

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (13:04 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలవడంపై హిల్లరీ క్లింటన్ మనో వేదనకు గురైయ్యారు. తొలిసారి మీడియాతో హిల్లరీ మాట్లాడుతూ ఓడిపోయినా.. అమెరికన్ల కలలు నెరవేర్చేందుకు సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా విజేత ట్రంప్‌గు హిల్లరీ అభినందనలు తెలిపారు. చాలా కష్టపడినా మనకు కోరుకున్న ఫలితాలు రాలేదని,  ఈ ఎన్నికల్లో దేశం కోసం ప్రజల ముందు మనం ఉంచిన దృక్పథం, మనం చూపిన విలువలు అత్యధికుల మనసులను మెప్పించలేదని హిల్లరీ పేర్కొన్నారు.
 
కానీ దేశాన్ని ఒకతాటిపైకి తెచ్చే క్రమంలో మనం నిర్వహించిన ప్రచారం సంతృప్తినిచ్చిందని.. దేశ ప్రజల పట్ల తాను కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నానని.. కానీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడానికి క్షమించండి అంటూ హిల్లరీ వ్యాఖ్యానించారు. 
 
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. రాజకీయంగా ఎటువంటి పదవులు చేపట్టకుండా నేరుగా అమెరికా అధ్యక్షుడైన తొలి వ్యక్తిగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా మరో అరుదైన రికార్డును సృష్టించారు. ట్రంప్ గెలుపుతో అమెరికా ప్రథమ మహిళగా గుర్తింపు పొందనున్న రెండో విదేశీ మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు 1825-1829లో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్స్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా మొదటి విదేశీ మహిళగా రికార్డు సృష్టించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments