Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ల ఏకాగ్రతకు దెబ్బ.. పొట్టి స్కర్టులొద్దు.. పబ్లిసిటీ కోసం కాదు..

Webdunia
శనివారం, 4 జులై 2015 (17:57 IST)
పొట్టి స్కర్టులపై బ్రిటన్‌ స్టాఫోర్డ్ షైర్‌లో ఉన్న రొవెనా బ్లెంకోవే ఆఫ్ ట్రెంథామ్ హైస్కూల్ నిషేధం విధించింది. పురుషులైన టీచర్ల ఏకాగ్రతకు అమ్మాయిలు ధరించే పొట్టి స్కర్టులు కారణమవుతున్నాయని రొవెనా బ్లెంకోవే ఆఫ్ ట్రెంథామ్ హైస్కూల్' యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో 9, 10, 11 తరగతులు చదువుతున్న అమ్మాయిలు ఇకపై పొట్టి స్కర్టులు వేసుకోవద్దని పేర్కొంది. 
 
హెర్ట్ ఫోర్డ షైర్ లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ 'సెయింట్ మార్గరెట్ స్కూల్' కూడా ఇప్పటికే స్కర్ట్ లను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. పబ్లిసిటీ కోసం తాము ఈ నిర్ణయం తీసుకోలేదని... కేవలం ఇబ్బందుల్ని తొలగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ వెల్లడించారు. విద్యాసంవత్సరం పెరిగే కొద్దీ స్కర్టులు పొట్టివి అవుతున్నాయని... స్కర్టుల పొడవు పెంచుకోవాలని అమ్మాయిల తల్లిదండ్రులకు తాము చెబుతున్నప్పటికీ, చాలామంది పట్టించుకోవడం లేదన్నారు. 
 
పొట్టి స్కర్టు వేసుకుని మెట్లమీద నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు అధ్యాపకులతో పాటు, తోటి విద్యార్థులకు కూడా ఏకాగ్రత దెబ్బతింటోందని ప్రిన్సిపల్ తెలిపారు. అమ్మాయిల స్కర్టులు కేవలం వారి బాటమ్‌ను మాత్రమే కవర్ చేసేలా ఉన్నాయని, అందుకే స్కర్ట్‌లను నిషేధించడం తప్ప వేరే దారి లేదని ప్రిన్సిపల్ చెప్పారు.ఈ సెప్టెంబర్ నుంచి అమ్మాయిలు కూడా విధిగా ట్రౌజర్లను ధరించాలన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments