Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెండు జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ కుక్కలకు మరణశిక్ష

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:58 IST)
పాకిస్థాన్ దేశంలో రెండు జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించారు. ఈ ఆశ్చర్యకర ఘటన కరాచీలో జరిగింది. ఈ కుక్కలకు ఉరిశిక్ష వేయడానికి కారణం క‌రాచీలోని ఓ లాయ‌ర్‌పై దాడి చేయడమే. 
 
గ‌త నెల‌లో మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన లాయ‌ర్ మీర్జా అక్త‌ర్‌పై ఈ రెండు కుక్క‌లు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడి అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. 
 
ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. వాటిని ఇళ్ల మ‌ధ్య ఉంచినందుకు య‌జ‌మానిని విమ‌ర్శిస్తూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై లాయ‌ర్ అక్త‌ర్ కోర్టుకెళ్ల‌డంతో కుక్క‌ల య‌జ‌మాని రాజీకొచ్చాడు.
 
అయితే కోర్టు బ‌య‌ట సెటిల్మెంట్‌లో భాగంగా ఆ కుక్క‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డానికి అంగీక‌రించి లాయ‌ర్‌తో వాటి య‌జమాని రాజీకొచ్చారు. అయితే రాజీకి అంగీక‌రిస్తూనే ప‌లు ష‌ర‌తులు విధించారు. ఆ కుక్క‌ల‌ను వెంట‌నే ఓ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి విష‌పూరిత ఇంజెక్ష‌న్ల‌తో చంపేయాల‌ని కోరారు.
 
అంలాగే, ఈ ఘ‌ట‌న‌పై బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి ప్ర‌మాద‌క‌ర కుక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌ద్ద‌ని స‌ద‌రు య‌జ‌మానికి లాయ‌ర్ అక్త‌ర్ ష‌ర‌తులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్ద‌రూ సంత‌కాలు చేసి కోర్టులో స‌మ‌ర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments