Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ భుట్టో హత్య కేసు : పర్వేజ్ ముషారఫ్‌కు షాక్.. ఇద్దరు పోలీసులకు 17 ఏళ్ల జైలు శిక్ష

2007 డిసెంబర్ 27వ తేదీన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రావల్పిండిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల సభలో పాల్గొని వస్తున్న భుట్టోపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (16:57 IST)
2007 డిసెంబర్ 27వ తేదీన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రావల్పిండిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల సభలో పాల్గొని వస్తున్న భుట్టోపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాత్ర కూడా వుందని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ముషారఫ్‌కు కోర్టు షాకిచ్చింది. 
 
బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ దేశం నుంచి పారిపోయాడని కోర్టు కీలక ప్రకటన చేసింది. అంతేగాకుండా భుట్టో హత్యకు జరిగిన కుట్ర గురించి ముషారఫ్‌కు బాగా తెలుసునని.. ఆమె హత్యలో ఆయన పాత్ర కూడా వుందని కోర్టు తేల్చి చెప్పింది. రావల్పిండిలో భుట్టో ఎన్నికల సభకు అప్పటి ముషారఫ్ సర్కారు భద్రత కల్పించడంలో విఫలమైందని పేర్కొంది. 
 
ఇంకా ఈ కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరు పోలీసు అధికారులకు కోర్టు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతేగాకుండా ఇద్దరికి రూ.5లక్షల చొప్పున జరిమానా విధించింది. కాగా రావల్పిండిలో జరిగిన ఎన్నికల సభ సందర్భంగా భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆమె మరణించిన పదేళ్లకు తర్వాత  ఈ కేసుపై కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments