Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెషావర్ దాడులకు భారతే కారణం: పర్వేజ్ ముషారఫ్ ఆరోపణ

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (11:03 IST)
పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడుల అనంతరం భారత్ అందించిన మద్దతును పాకిస్థాన్ నేతలు ప్రశంసిస్తుంటే, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ మాత్రం దాడులకు భారతదేశమే కారణమంటున్నారు. 
 
తెహ్రీక్-ఏ-తాలిబన్ కమాండర్ మౌలానా ఫజులుల్లా ఓ ఆఫ్ఘన్ జాతీయుడని, అతడికి శిక్షణ ఇచ్చింది భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని ఆరోపించారు. చిన్నారులను చంపిన తాలిబన్లకు శిక్షణ ఇచ్చిందే భారతేనని ఉద్ఘాటించారు. పాకిస్థాన్ వ్యాప్తంగా దాడులు చేసేందుకు భారత్, ఆఫ్ఘన్ దేశాలు తాలిబన్ కమాండర్‌కు సహకరిస్తున్నాయని అన్నారు. 
 
భారత్‌పై విషం కక్కే జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ కూడా పెషావర్ దాడులకు భారత్‌నే వేలెత్తి చూపిస్తున్నాడు. సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి వెనుక భారత్ హస్తం ఉందన్నాడు.
 
అంతేగాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలకు దన్నుగా భారత్ తన బలగాలను పంపితే, కాశ్మీర్‌లోని తమ సహోదరులకు సాయపడేందుకు ముజాహిదిన్‌లు ముందుకు కదులుతారని హెచ్చరించారు. సాయం కోసం కాశ్మీరీలు ఎలుగెత్తుతున్నారని, వారికి సాయపడడం తమ ధర్మం అని హఫీజ్ పేర్కొన్నాడు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments