Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిని ఫ్రై చేస్తావా.. అందుకే రో...బో...తో కొడతానంటున్న నాసా

సూర్యుడి సమీపంలోకి కాదు కదా.. భూమినుంచి 30 వేల కిలోమీటర్ల పైకి వెళితేనే మనిషి మలమలా మాడిపోతాడు. కానీ సూర్యుడిలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మనిషిని పట్టి పీడిస్తోంది కదా. అందుకే మనిషిని మలమల మాడ్చే సూర్యుడి వద్దకు మనిషిని కాకుండా రోబోను మాత్రమే పంపు

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (02:52 IST)
భూమి నుంచి సూర్యుడి దూరం 14 కోట్ల 90 లక్షల కిలోమీటర్లు. అంత దూరంలో ఉండి కూడా ఆ మహానుభావుడు ఎవ్రీ సమ్మర్‌ మన భూగోళాన్ని ఫ్రై చేసేస్తుంటాడు. అలాంటి సూర్యుడి సమీపంలోకి కాదు కదా.. భూమినుంచి 30 వేల కిలోమీటర్ల పైకి వెళితేనే మనిషి మలమలా మాడిపోతాడు. కానీ సూర్యుడిలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మనిషిని పట్టి పీడిస్తోంది కదా. అందుకే మనిషిని మలమల మాడ్చే సూర్యుడి వద్దకు మనిషిని కాకుండా రోబోను మాత్రమే పంపుతానంటోంది అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ నాసా.
 
ఇంత కూల్‌ థాట్‌ నాసాకు ఎందుకొచ్చింది చెప్మా! అది తర్వాత చూద్దాం. ముందు మాట్లాడుకోవలసిన సంగతేంటంటే... నాసా సూర్యుడిపైకి వెళుతోంది. కానీ మనిషిని పంపడం లేదు. అలాగని శాటిలైట్‌నూ పంపడం లేదు. మరి ఎవరు వెళుతున్నట్లు ఒక రోబో వెళుతోంది. వెళ్లి అదేం చేస్తుందంటే... కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటుంది! అయితే అది మరీ సూర్యుడి మీదకు వెళ్లి దిగదు. 
 
సూర్యుడికి దూరంగా ఉండి, శలభంలా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ భూమి మీదకు సమాచారం పంపుతుంది. ‘ఇక్కడ అలా ఉంది, అక్కడ ఇలా ఉంది’ అని. అన్నిటికన్నా కూడా శాస్త్రవేత్తల్ని ఏళ్లుగా ఒక ప్రశ్న పీడిస్తోంది. సూర్యుడి లోపల వేడి తక్కువగా ఉంటుంది. సూర్యుడి బయట వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకలా అన్నదే ఆ పీడించే ప్రశ్న.  దానికి సమాధానం కనుక్కోడానికే నాసా ఇప్పుడీ రోబోను పంపుతోంది.
 
సూర్యుడి ఉపరితలాన్ని ‘ఫొటోస్పియర్‌’ అంటారు. అక్కడ సహజంగానే వేడి అదిరిపోతుంది. సూర్యుడి చుట్టూ వాతావరణాన్ని ‘కరోనా’ అంటారు. అక్కడ మరీ అంత అదిరిపోకూడదు. కానీ ఫొటోస్పియర్‌లో కన్నా, కరోనాలోనే ఎక్కువ వేడి ఉంటున్నట్లు ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు కనిపెట్టారు! సూర్యుడి ఉపరితలంపై 5,500 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటే, సూర్యుడి చుట్టుపక్కల 20 లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉంటోంది!! అలా ఎందుకు ఉంటోందన్నది మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. 
 
ఆ సంగతి తేల్చుకోడానికే నాసా ఇప్పుడు చొక్కా చేతులు పైకి మడుస్తోంది. భూమి నుంచి సూర్యుడి దూరం 14 కోట్ల 90 లక్షల కిలోమీటర్లు. అంత దూరంలో ఉండి కూడా ఆ మహానుభావుడు ఎవ్రీ సమ్మర్‌ మన భూగోళాన్ని ఫ్రై చేసేస్తుంటాడు. ఇప్పడీ రోబో తగుదునమ్మా అంటూ సూట్‌కేస్‌ పట్టుకుని ఆయన దగ్గరికే బయల్దేరుతోంది. అందులో ఏవో టూల్స్‌ ఉంటాయట! వాటితో పరిశోధనలు చేస్తుందట. ఎంత వెళ్లినా, సూర్యుడికి 60 లక్షల కిలో మీటర్ల దూరం వరకే ఆ రోబో వెళ్లగలదు. అంతవరకే మనిషి శాస్త్రవిజ్ఞాన సామర్థ్యం. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments