Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే వెల్లడి

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (13:02 IST)
తన అనారోగ్యం గురించి వస్తున్న కథనాలను ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కొట్టిపారేశారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల ఈ బ్రెజిల్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ స్థితిలో ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో  నన్ను ఐసీయూలో ఉంచలేదు. ఏకాంతంగా ఉండేందుకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిలో ఉంచినట్టు తెలిపారు. అందరి ప్రేమ, అభిమానంతో కోలుకున్నాను. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన  అవసర లేదన్నారు. కొత్త ఏడాది సరికొత్త ఆరోగ్యంతో గడపాలనుకుంటున్నాను. అలాగే విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నాను’ అని పీలే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
మూత్ర పిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు ఈనెల 13న సర్జరీ చేయించుకున్న పీలే... సోమవారం ఇన్‌ఫెక్షన్ సోకిన కారణంగా మరోసారి అడ్మిట్ అయ్యారు. పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయనకు హెమోడయాలసిస్ జరుపుతున్నట్టు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రి పేర్కొంది. కృత్రిమ కిడ్నీ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి పీలే శరీరంలోకి పంపుతున్నారు. కాగా ఇదే విషయాన్ని ఆయన కుమార్తెలు కూడా శనివారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments