Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమలి బార్‌కు వెళ్లింది.. అక్కడ ఏం జరిగిందంటే? (వీడియో)

మద్యం అమ్మే బారుకు నెమలి వెళ్ళింది. నెమలి బీర్ షాపులోకి వెళ్లగానే బార్ యజమాని జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ సిబ్బంది షాపుకు చేరుకునేలోపే బీర్ సీసాలను నెమలి పగులకొట్టింది. ఈ ఘటన కాలిఫోర

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (16:05 IST)
మద్యం అమ్మే బారుకు నెమలి వెళ్ళింది. నెమలి బీర్ షాపులోకి వెళ్లగానే బార్ యజమాని జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ సిబ్బంది షాపుకు చేరుకునేలోపే బీర్ సీసాలను నెమలి పగులకొట్టింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. నెమలి బీర్ బాటిల్స్‌ని కిందకు తోసేయడంతో  దాదాపు రూ.30 వేల వరకు నష్టం ఏర్పడింది. చివ‌రకి జూ సిబ్బంది దానిని పట్టుకుని తీసుకెళ్లారు. 
 
ఈ ఘ‌ట‌న గురించి జూ అధికారులు మాట్లాడుతూ ఆ నెమ‌లి అడ‌వి నుంచి త‌ప్పిపోయి ఆర్కాడియా ప్రాంతంలో ఉన్న రాయల్‌ ఓక్‌ లిక్కర్ దుకాణానికి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే కస్టమర్లు జడుసుకున్నారు. ఇంకా నెమలి కూడా అక్కడి కస్టమర్లపైకి కూడా దూకుతూ వారు బెదిరిపోయేలా చేసింద‌న్నారు. ఈ నెమ‌లిని ప‌ట్టుకునేట‌ప్పుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వలతో కూడిన గరిటె లాంటి దానితో నెమలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతలో అది కాస్త ఎగురుతూ బీర్ బాటిల్స్‌ను కిందకు తోసేసిందని సిబ్బంది వెల్లడించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments