నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణక

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:35 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైగా, ఈ కేసులో నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ పాత్రపై కూడా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 
 
పైగా, ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి, 60 రోజుల్లోనే నివేదికను సమర్పించాలంటూ జిట్‌ను ఆదేశించింది. అంటే మరో రెండు నెలల్లో షరీఫ్ భవితవ్యం తేలిపోనుంది. షరీఫ్‌పై కోర్టు విచారణకు ఆదేశించడంతో పాలనపై సైన్యం పట్టుబిగించేందుకు సిద్ధమవుతోంది. పనామా పేపర్స్ వ్యవహారంలో షరీఫ్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తొలి నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments