Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి కళ్ళు గుడ్లు పీకేసి.. కాళ్ళు నరికేసిన సోదరులు.. పాకిస్థాన్‌లో ఘోరం..

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరి పట్ల ఇద్దరు సోదరులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన పాకిస్థాన్ పంజాబ్ ముజఫర్‌ఘర్‌లో చోటుచేసుకుంది. సోదరి అని కూడా చూడకుండా కళ్ళు

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (17:58 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరి పట్ల ఇద్దరు సోదరులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన పాకిస్థాన్ పంజాబ్ ముజఫర్‌ఘర్‌లో చోటుచేసుకుంది. సోదరి అని కూడా చూడకుండా కళ్ళు గుడ్లు పీకేసి, కాళ్ళు సరికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
వివరాల్లోకి వెళితే.. షరీఫాన్ బీబీ అనే 40 ఏళ్ల మహిళపై ఈ ఘోరం జరిగింది. సోదరుడి కుమార్తె కనిపించకపోవడంతో సోదరి తన బిడ్డను కిడ్నాప్ చేసిందని అనుమానించాడు. దీంతో బీబీ సోదరులు కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆపై ఇద్దరు కలిసి ఓ పదునైన కత్తితో సోదరి రెండు కళ్ళ గుడ్లు పీకేశారు. అనంతరం ఆమె రెండు కాళ్ళు కూడా నరికేశారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పాక్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ సోదరులను అరెస్ట్ చేయలేదు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే.. వివాదాస్పద పాకిస్థానీ మోడల్ కండీల్ బలోచ్ గతంలో దారుణ హత్యకు గురయ్యారు. పరువు తీస్తుందని తన సోదరి అయిన కండీల్‌ను అమానుషంగా ఆమె సోదరుడే హతమార్చిన ఘటన మరవకముందే.. ముజఫర్‌ఘర్‌లో సోదరిపై సోదరులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments