Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకాలు రాసి, ప్రసంగాలు చేసి బిలియనీర్ అయిన మలాలా: ప్రసంగానికి కోటి తీసుకుంటుందట!

తాలిబన్లతో పోరాటం చేసి మహిళా విద్య కోసం పాటుపడుతున్న నోబెల్ అవార్డు గ్రహీత మలాలా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తన ఆత్మకథ, ప్రసంగాల ద్వారా సంపాదించిన ఆదాయంతో బిలియనీర్ల జాబితాలో మలాలా చోటు సంపాద

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:15 IST)
తాలిబన్లతో పోరాటం చేసి మహిళా విద్య కోసం పాటుపడుతున్న నోబెల్ అవార్డు గ్రహీత మలాలా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తన ఆత్మకథ, ప్రసంగాల ద్వారా సంపాదించిన ఆదాయంతో బిలియనీర్ల జాబితాలో మలాలా చోటు సంపాదించుకుంది. ఇంకా నోబెల్ బహుమతి పొందిన వారిలోనూ ఎక్కువ ఆదాయం ఆర్జించే వ్యక్తిగానూ మలాలా రికార్డు సృష్టించింది. 
 
కాగా తన జీవితంలో జరిగిన ఘటనలను, అనుభవాలను ''ఐ యామ్ మలాలా" పుస్తకంలో మలాలా రాసింది. ఈ పుస్తకాలు ప్రపంచ వాప్తంగా 18 లక్షల కాపీలు అమ్ముడైనాయి. తద్వారా ప్రచురించిన సంస్థకు 2015 ఆగష్టు నాటికే దాదాపు రూ. 20 కోట్ల ఆదాయం చేకూరింది. ఇక ఈ సంస్థకు మలాలా తల్లిదండ్రులు భాగాస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మలాలా ఒక్కో ప్రసంగానికి రూ. కోటీ పైనే తీసుకుంటుందట. పుస్తకాలు రాసి.. ప్రసంగాలు చేసి మలాలా బిలియనీర్ అయిపోయిందని ఓ బ్రిటన్ పత్రిక తెలిపింది. 
 
కాగా 2008 జనవరిలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతూ.. మహిళా విద్య అవసరమని గొంతెత్తి పలికిన మలాలాపై 2012న తాలిబన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మలాలా... బ్రిటన్‌లో చికిత్స పొంది తిరిగి మామూలు మనిషిగా మారింది. ప్రస్తుతం బిర్మింగ్‌హామ్‌లో తన కుటుంబంతో కలిసి వుంటున్న మలాలా ఎడ్గ్‌బాస్టన్ హైస్కూల్‌ను 2013లో ప్రారంభించింది. ఈ క్రమంలోనే మలాలా సేవ కోసం.. ఆమెకు నోబెల్ అవార్డు లభించింది. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments