Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మోడల్ నయాబ్ నదీమ్‌ను గొంతుకోసి హత్య

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:25 IST)
పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రముఖ పాక్ మోడల్ నయాబ్ నదీమ్ దారుణ హత్యకు గురైంది. ఆమెను గొంతు కోసి అతి  కిరాతకంగా హత్య చేశారు. అంతేకాకుండా, ఆమె నగ్నమృతదేహాన్ని ఇంట్లో పడేసి హంతకులు వెళ్లిపోయారు. ఈ విషయం ఆమె సవతి సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లాహోర్‌ నివాసం ఉంటున్న నదీమ్ ఆదివారం తన ఇంట్లోనే హత్యకు గురైంది. నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారని పాక్ మీడియా పేర్కొంది. 
 
నయాబ్‌ సవతి సోదరుడిచ్చిన ఫిర్యాదతో పోలీసులు కేసు నమోదు చేశారు. 29 ఏళ్ల నయాబ్‌ ఇంకా వివాహం చేసుకోలేదు. లాహోర్‌లోని డిఫెన్స్‌ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. 
 
దీనిపై నయాబ్ సవతి సోదరుడు నసీజ్ స్పందిస్తూ, శనివారం అర్థరాత్రి తామిద్దరు ఐస్‌క్రీం తినడానికి బయటకు వెళ్లామనీ, ఆ తర్వాత నేను ఆమెను ఇంట్లో వదిలిపెట్టి మా ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్‌ కాల్‌ చేసింది. కానీ పడుకుని ఉండటంతో నేను ఫోన్ తీయలేదు. ఆదివారం ఉదయం తిరిగి కాల్ చేయగా, ఆమె తీయలేదు. దీంతో ఆమెను చూడటానికి వెళ్లగా, ఇంట్లో భయానక దృశ్యం కనిపించిందన్నారు. 
 
ఆమెను గొంతు కోయడంతో రక్తస్రావం బాగా జరిగింది. దీంతో ఆమె మృతదేహం రక్తం మడుగులో పడివుంది. ఆ దృశ్యం చూడగానే భయంతో వణికిపోయారు. ఆ తర్వాత తేరుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్‌ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. నగ్న మృతదేహాన్ని టీవీ ఉండే హాలులో పడేసి వెళ్లారని వివరించారు. దీనిపై పాక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments