Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి భర్త : ఉద్యోగం చేస్తోందనీ భార్య తల నరికేశాడు

పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఉద్యోగానికి వెళ్లొద్దు... ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పినా భార్య పట్టి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (17:01 IST)
పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఉద్యోగానికి వెళ్లొద్దు... ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పినా భార్య పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కసాయి భర్త.. కత్తితో తల నరికేశాడు. ఈ దారుణం పాకిస్థాన్ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌, రాయ్‌విండ్ అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాయ్‌విండ్‌ ప్రాంతంలో అఫ్రహీం, నస్రీన్ అనే దంపతులు ఉన్నారు. వీరిలో నస్రీన్ స్థానికంగా ఉండే ఓ కర్మాగారంలో పనిచేస్తోంది. అయితే, భార్య పని చేయడం అఫ్రహీంకు ఏమాత్రం ఇష్టంలేదు. దాంతో పలుమార్లు ఉద్యోగం మానేయాలంటూ చిత్రహింసలు పెట్టేవాడు. 
 
ఈనేపథ్యంలో శనివారం ఇద్దరి మధ్య ఉద్యోగం విషయమై వివాదం చోటుచేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన అఫ్రహీం.. ఆమె న్రిదపోతుండగా గది తలుపులు మూసేసి ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికేశాడు. 
 
ఆదివారం ఉదయం పిల్లలు లేచి చూడగా తల్లి జీవచ్ఛవంలాపడి ఉండడం చూసి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. వారుపోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు అఫ్రహీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments