Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతును ఇంటర్వ్యూ చేశాను.. అది 'అంబా' అంటూ సమాధానమిచ్చింది.. పాక్ రిపోర్టర్

ఈ లోకంలో వింతలకు విడ్డూరాలకు కొదవే లేదు. అలాంటి వింత ఘటన ఒకటి పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. అదేంటంటే పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ టీవీఛానల్ రిపోర్టర్ ఓ దున్నపోతుని ఇంటర్వ్యూ చేశాడు. వినడానికే విడ్డూరం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:53 IST)
ఈ లోకంలో వింతలకు విడ్డూరాలకు కొదవే లేదు. అలాంటి వింత ఘటన ఒకటి పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. అదేంటంటే పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ టీవీఛానల్ రిపోర్టర్ ఓ దున్నపోతుని ఇంటర్వ్యూ చేశాడు. వినడానికే విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. మూగజీవిని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
ఆ వివరాలలోకి వెళితే.. పాకిస్థాన్‌‌లోని లాహోర్‌‌లో విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి ఓ ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని అధికారులు నిర్మించారు. అయితే.. మనుషులు మాత్రమే కాకుండా, దున్నపోతులు కూడా ఆ ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి పై నుండే నడవాలని అధికారులు కొత్త రూల్‌ని ప్రవేశపెట్టారు. దీనితో ఆ మూగజీవాలు ఈ బ్రిడ్జి ఎక్కి దిగలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. 
 
లాహోర్‌లో  బ్రిడ్జిపై సాధారణంగా జనాలే నడుస్తుంటారు. కానీ ఇప్పుడు వెరైటీగా దున్నపోతులు కూడా నడుస్తున్నాయి. పాపం ఆ మూగజీవాలు అంత ఎత్తున్న బ్రిడ్జి ఎక్కి దిగలేక నానా అవస్థలు పడుతుండడంతో ఈ సంఘటనను టెలికాస్ట్ చేయడానికి పాక్‌కు చెందిన ఓ ప్రముఖ టీవీఛానల్ రిపోర్టర్ అక్కడికి వెళ్లాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆయన ప్రశ్నలు అడగడమేమోగాని ఆ దున్నపోతులు సమాధానం చెప్పడం కూడా విశేషం. 
 
ఇలా బ్రిడ్జి ఎక్కి పైనుంచి రోడ్డు దాటడం మీకెలా ఉంది... దీనిపై మీ అభిప్రాయమేమిటీ... అని ఓ దున్నపోతు దగ్గర మైక్ పెట్టి అడిగాడు. దీనికి ఆ దున్నపోతు 'అంబా' అని అరిచింది. దీనితో ఆ దున్నపోతు చెప్పడానికి కూడా బాధపడుతున్నట్లు ఆ రిపోర్టర్ చెప్పాడు. పశువులు మాట్లాడలేవని తెలిసి కూడా తన అతివినయంతో ప్రవర్తించిన జర్నలిస్ట్ పేరు అమిన్ హఫీజ్. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments