Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఆదేశాలతో అత్యాచారం.. అవమానం భరించలేక గర్భిణీ ఆత్మహత్య...

పంచాయతీ పెద్దల ఆదేశాలతో ఓ గర్భిణీ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడో కామాంధుడు. దీన్ని జీర్ణించుకోలేని ఆ మహిళ... ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ దేశంలో జరిగింది. పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (09:22 IST)
పంచాయతీ పెద్దల ఆదేశాలతో ఓ గర్భిణీ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడో కామాంధుడు. దీన్ని జీర్ణించుకోలేని ఆ మహిళ... ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ దేశంలో జరిగింది. పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని గుజరాత్ సిటీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. దానికి శిక్షగా రేప్ చేసిన నిందితుడి కూతురిపై అత్యాచారం చేయాలని సాక్షాత్తూ పంచాయతీ పెద్దలే తీర్పు చెప్పారు. 
 
నిందితుడి కూతురికి అప్పటికే పెళ్లి కావడంతో ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పటికీ మహిళపైనే పంచాయతీ ఆదేశం మేర అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో గర్భిణీ అవమాన భారంతో శరీరం కాల్చుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణీ మరణించింది. 
 
పంచాయతీ పెద్దల ఆదేశాలతోనే తనపై రేప్ చేశాడని గర్భిణీ మరణవాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మృతురాలి భర్త నిరాకరించడంతోపాటు తనకు అల్లానే న్యాయం చేస్తాడని చెప్పడం విశేషం. ఫిర్యాదు ఇవ్వకున్నాపాకిస్థాన్ పోలీసులు మృతురాలి వాంగ్మూలం ప్రకారం పంచాయతీ పెద్దలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం