Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రకోట భారత్‌ది కాదు.. పాకిస్థాన్‌ది : చైనా చాయాచిత్రాల పదర్శనలో అపశృతి

చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది పాకిస్థాన‌కు చెందినది పేర్కొంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (13:18 IST)
చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది పాకిస్థాన‌కు చెందినది పేర్కొంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆ దేశానికి చెందిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమానికి భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాక్ ప్రతినిధి మసూద్ ఖలీద్‌లు హాజరయ్యారు. ఇందులో ఓ ఛాయాచిత్రాన్ని లాహోర్‌లోని షాలిమార్ గార్డెన్స్‌గా నిర్వాహకులు పేర్కొన్నారు. దాన్ని చూసిన భారత్, పాక్ ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. ఆ ఛాయాచిత్రం ఏమిటంటే... ఢిల్లీలోని మన ఎర్రకోట. ఎర్రకోటపై మన మువ్వన్నెల జెండా కూడా ఎగురుతుండటం గమనార్హం.
 
దీంతో, వెంటనే ఈ విషయాన్ని నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లాకగనీ, వారు నిద్రమేల్కోలేదు. ఆ తర్వాత ప్రదర్శన నిర్వాహకులపై వారు మండిపడ్డారు. ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నప్పుడు, ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో, జరిగిన తప్పుకు నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments